Palestine supporters: మెల్‌బోర్న్‌లో పాలస్తీనా మద్దతుదారుల నిరసన.. గాజాపై యుద్ధాన్ని నిలిపివేసేలా ఆస్ట్రేలియా ప్రయత్నాలు చేయాలని డిమాండ్

by Maddikunta Saikiran |
Palestine supporters: మెల్‌బోర్న్‌లో పాలస్తీనా మద్దతుదారుల నిరసన.. గాజాపై యుద్ధాన్ని నిలిపివేసేలా ఆస్ట్రేలియా ప్రయత్నాలు చేయాలని డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా(Australia)లోని మెల్‌బోర్న్‌ (Melbourne) నగరంలో "డిఫెన్స్‌ ఎక్స్‌పో"(Defence expo)కు వ్యతిరేకంగా బుధవారం పాలస్తీనా మద్దతుదారులు(Palestine supporters)ఆందళోనలకు దిగారు.ఇజ్రాయెల్(Israel) వెంటనే గాజాపై యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకుపడ్డారు.పాలస్తీనా మద్దతుదారులపై పోలీసులు స్పాంజ్‌ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్, ఫ్లాష్‌ బ్యాంగ్‌ పరికరాలు, స్ప్రేలను ప్రయోగించారు.పోలీసులపై దాడి,రహదారిని అడ్డుకోవడం,ప్రభుత్వ ఆస్తుల దగ్ధం లాంటి నేరాలపై 33 మంది నిరసనకారులను అరెస్ట్‌ చేశారు.పోలీసులపై రాళ్లతో, గుర్రపు ఎరువు, లిక్విడ్‌ సీసాలతో నిరసనకారులు దాడి చేశారని విక్టోరియా(Victoria) స్టేట్‌ పోలీస్‌ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. మెల్‌బోర్న్‌లో (Melbourne) నిర్వహిస్తున్న ల్యాండ్‌ ఫోర్సెస్‌ 2024 ప్రదర్శన(Defence expo)ను అడ్డుకోవాలంటూ స్టూడెంట్స్‌ ఫర్‌ పాలస్తీనా అండ్‌ డిస్రప్ట్‌ వార్‌(Students for Palestine&Distrupt War) గ్రూపులు గత కొన్ని రోజుల క్రితం పిలుపునిచ్చాయి.విద్యారి సంఘాల పిలుపు మేరకు సుమారు 1200 మంది ఈ నిరసనలో పాల్గన్నారు. పాలస్తీనా జెండాలు చేతపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.పాలస్తీనా-ఇజ్రాయెల్‌ యుద్ధం విషయంలో ఆస్ట్రేలియా తన పద్దతిని మార్చుకోవాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.

కాగా ఆస్ట్రేలియాలోని రెండవ అతిపెద్ద నగరమైన మెల్‌బోర్న్‌ 2000 సంవత్సరంలో వరల్డ్‌ఎకనామిక్‌ ఫోరమ్‌కు(World Economic Forum) అతిథ్యమిచ్చింది. ఆ తర్వాత ఇదే అతిపెద్ద పోలీస్‌ ఆపరేషన్‌ అని ఆస్ట్రేలియా మీడియా నివేదించింది.కాగా శుక్రవారం వరకు జరిగే ఈ కార్యక్రమానికి 31 దేశాల నుండి దాదాపు 1,000 ఎగ్జిబిటింగ్ సంస్థలు హాజరుకానున్నాయి. ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే అతిపెద్ద డిఫెన్స్‌ ఎక్స్‌పో అని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed