Pak News : పాకిస్తాన్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి, 9 మందికి పైగా గాయాలు..!

by Maddikunta Saikiran |
Pak News : పాకిస్తాన్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి, 9 మందికి పైగా గాయాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దాయాది దేశం పాకిస్తాన్‌లోని కరాచీలో ఆదివారం రెండు వర్గాల మధ్య ఘోరమైన ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారని ,మరో తొమ్మిది మంది గాయపడ్డారని జియో న్యూస్ అనే సంస్థ వెల్లడించింది. గోలిమార్ ప్రాంతంలో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో ఈ ప్రాణనష్టం జరిగింది. దీంతో ఆగ్రహించిన కొందరు సభ్యులు వాహనాలకు నిప్పుపెట్టి లాస్బెల్లా నుంచి నజీమాబాద్‌కు వెళ్లే ప్రధానమైన రెండు రోడ్లను మూసివేశారు.కాగా ఘటన జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, పోలీస్ బృందాలు ఘటన జరిగిన ప్రాంతంలో గస్తీ కాస్తున్నాయని కరాచీ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) ఆఫ్ పోలీస్ జావేద్ ఆలం ఓధో తెలిపారు.

ఇదిలా ఉండగా, ఓ ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయని వెస్ట్ డిఐజి ఇర్ఫాన్ బలోచ్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని,తొమ్మిది మంది గాయపడ్డారని వెల్లడించారు. గాయపడ్డ వారిని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ (JPMC) కు తరలించి చికిత్స అందిస్తున్నామని డిఐజి ఇర్ఫాన్ తెలిపారు. కాగా జరిగిన ఘటనపై సింధ్ హోం మంత్రి జియా లంజర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ ఘటనకు సంభందించి వివరాలను సింధ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ (AIG) లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని తక్షణమే అదుపులోకి తీసుకురావాలని పోలీసులకు సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి, శాంతిభద్రతలకు విఘాదం కలిగించడానికి ఎవరూ ప్రయత్నించిన సహించేది లేదన్నారు. అలాగే నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed