- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగ్రవాదులతో ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్.. క్షణాల్లో వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఫైనల్‌కు వచ్చే వరకూ ఎవరికీ తెలియని వ్యక్తి.. ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. దీంతో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కు సంబంధించిన విషయాలపై సోషల్ మీడియలో చర్చించడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అర్షద్ నదీమ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తున్నది. ఆ వీడియోలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన నాయకుడు హారిస్ దార్ పక్కన కూర్చొని అర్షద్ నదీమ్ ముచ్చటిస్తున్నారు. ఇటీవల ఒలంపిక్స్‌లో అర్షద్ గోల్డ్ మెడల్ సాధించిన నేపథ్యంలో ఈ వీడియోలో వెలుగులోకి వచ్చింది.
అసలు ఈ వీడియో ఎప్పటిది?, ఎవరు తీశారు?, ఉగ్రవాదులను నదీమ్ ఎందుకు కలిశారు? అనే విషయాలు పక్కన పెడితే.. వెలుగులోకి వచ్చిన క్షణాల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో నదీమ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు సైతం ప్రారంభమయ్యాయి. మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం అర్షద్ నదీమ్‌ను దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరిస్తున్నట్లు ప్రకటించింది. గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్ మామ ముహమ్మద్ నవాజ్ అర్షద్‌కు గేదెను బహుమతిగా ఇచ్చారు. ఇది కాకుండా, అర్షద్ నదీమ్‌కు పాకిస్థానీ వ్యాపారవేత్త కారు బహుమతిగా కూడా ప్రకటించాడు. ఇలా ఆ దేశం ఘనంగా సత్కరిస్తున్న వేళ ఉగ్రవాదులతో కూర్చున్న వీడియో వైరల్ కావడం ఆయనకు ఒక మచ్చగా నెట్టింట చర్చించుకుంటున్నారు.