- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముంబైలో అన్‌రియల్ సినిమాటిక్ ఛాలెంజ్.. ఏప్రిల్ 1 వరకు ధరఖాస్తులు

దిశ, తెలంగాణ బ్యూరో: ముంబయిలోని వేవ్స్ 2025 లో అన్‌రియల్ సినిమాటిక్ ఛాలెంజ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) అర్హులైన అభ్యర్థుల నుంచి ఎప్రిల్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. తెలంగాణ విజువల్ ఆర్ట్స్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ (టీవీఏజీఏ) అసోసియేషన్, ప్రధాని మోడీ క్రియేట్ ఇన్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా, ముంబైలోని వేవ్స్ 2025లో అన్‌రియల్ సినిమాటిక్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం మార్చి 17న ప్రారంభమవగా, ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
అలాగే వేవ్స్ లో తుది ప్రదర్శనలు మే 1 నుంచి 4 వరకు జరగనున్నాయి. ఈ పోటీలో, ప్రతిభావంతులైన యానిమేషన్ కళాకారులు, డిజైనర్లు అన్‌రియల్ ఇంజిన్‌ని పయోగించి సినిమాటిక్ షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించాలి. ఈ పోటీ ద్వారా, భారతీయ యానిమేషన్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన వ్యక్తులను గుర్తించి, ప్రోత్సహించాలని టీవీఏజీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులు అందించనున్నారు. అంతేకాకుండా, వారి చిత్రాలు వేవ్స్ 2025లో ప్రదర్శించబడతాయి. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు టీవీఏజీఏ వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా, భారతీయ యానిమేషన్ పరిశ్రమలో కొత్త తరం ప్రతిభావంతులను ప్రోత్సహించడం, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ యానిమేషన్‌కు గుర్తింపు తీసుకురావాలని టీవీఏజీఏ లక్ష్యంగా పెట్టుకుంది.