- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రష్యా సరిహద్దు నుంచి 5,000 మంది పిల్లలను తరలించిన అధికారులు
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా సరిహద్దు ప్రాంతం బెల్గోరోడ్ నుంచి 5,000 మందికి పైగా పిల్లలను నుంచి తరలించినట్లు ఆ ప్రాంత గవర్నర్ శనివారం తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో షెల్లింగ్, డ్రోన్ల దాడి కారణంగా చాలా మంది పౌరులు చనిపోవడంతో 9,000 మంది మైనర్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని గత వారం అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు దీనికనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడుతూ, మా పిల్లలలో ఐదు వేల మంది ఇప్పటికే ఈ ప్రాంతం బయట ఉన్నారు, నిన్న, 1,300 మంది పిల్లలు సెయింట్ పీటర్స్‌బర్గ్, బ్రయాన్స్క్, మఖచ్కలాకు చేరుకున్నారని అన్నారు. అలాగే, మిగిలిన పిల్లలను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచి సరిహద్దు ప్రాంతాలు నిత్యం దాడులతో అల్లాడుతున్నాయి. ఈ దాడుల కారణంగా దుకాణాలు మూతపడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది.