ఉత్తర కొరియా మరోసారి రెచ్చ గొట్టే చర్యలు: తూర్పు తీరంలో క్రూయిజ్ క్షిపణుల ప్రయోగం

by samatah |
ఉత్తర కొరియా మరోసారి రెచ్చ గొట్టే చర్యలు: తూర్పు తీరంలో క్రూయిజ్ క్షిపణుల ప్రయోగం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. తాజాగా ఆ దేశంలోని తూర్పు తీరంలో క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్టు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించింది. ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో వీటిని ప్రయోగించినట్టు తెలిపింది. అయితే ఎన్ని క్షిపణులను పరీక్షించిందనే విషయాన్ని వెల్లడించలేదు. ఉత్తర కొరియా ‘పుల్హ్వాసల్-3-31’ అనే కొత్త వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రయోగం జరగడం గమనార్హం. ‘బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిలో పురోగతి సాధించి, రష్యాతో సహకారాన్ని బలపరిచిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలను పెంచే అవకాశం ఉందని దక్షిణ కొరియా భావిస్తోంది. కాగా, గతంలో ఉత్తర కొరియా 2021లో అణు దాడి సామర్థ్యాలతో కూడిన క్రూయిజ్ క్షిపణి మొదటి పరీక్షను నిర్వహించింది. ఈ ఏడాది జనవరి 14న తూర్పు సముద్రంలో ఘన-ఇంధన హైపర్‌సోనిక్ క్షిపణిని సైతం ప్రయోగించింది.

Advertisement

Next Story

Most Viewed