'బందీలను వదిలేదాకా గాజాకు నీళ్లివ్వం.. కరెంటివ్వం'.. హమాస్‌‌కు ఇజ్రాయెల్ వార్నింగ్

by Vinod kumar |
బందీలను వదిలేదాకా గాజాకు నీళ్లివ్వం.. కరెంటివ్వం.. హమాస్‌‌కు ఇజ్రాయెల్ వార్నింగ్
X

జెరూసలెం : ‘‘ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వాళ్లందరినీ హమాస్ విడిచిపెట్టేదాకా.. గాజాకు నీళ్లు, విద్యుత్, ఇంధనం, నిత్యావసరాలు అందకుండా అడ్డుకుంటాం’’ అని ఇజ్రాయెల్ ఇంధన శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ గురువారం స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్‌కు గురైన ప్రతి ఒక్కరు సురక్షితంగా తిరిగొచ్చేదాకా తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పారు. గాజాలోకి మానవతా సాయం కూడా చేరకుండా నిలువరిస్తామని ఆయన వెల్లడించారు.

దాదాపు 150 మంది ఇజ్రాయెలీలు, విదేశీ పౌరులను హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గాజాలోని ఏకైక పవర్ ప్లాంట్‌లో ఇంధనం అయిపోవడంతో.. ఆ ప్రాంత ప్రజలు గత మూడు రోజులుగా అంధకారంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. తాము ఎన్నో యుద్ధాలను చూశామని, ఇలాంటి భీకర దాడులను ఎప్పుడూ చూడలేదని గాజా పౌరులు చెబుతున్నారు. రాత్రి సమయంలో సెల్ ఫోన్ లైట్లతో కాలం వెళ్లదీస్తున్నామని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed