కూలిన పాఠశాల భవనం.. 22 మంది విద్యార్థుల దుర్మరణం

by Hajipasha |
కూలిన పాఠశాల భవనం.. 22 మంది విద్యార్థుల దుర్మరణం
X

దిశ, నేషనల్ బ్యూరో : నైజీరియాలోని ప్లాట్యూ రాష్ట్రం జోస్‌ నగరంలో పెను విషాదం చోటుచేసుకుంది. నగరంలోని బుసా బుజి ఏరియాలో ఉన్న సెయింట్స్ అకాడమీ విద్యార్థులు తరగతులకు వచ్చిన కొద్దిసేపటికే రెండంతస్తుల పాఠశాల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది 15 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారే. దాదాపు 154 మందికిపైగా పిల్లలు శిథిలాల కింద చిక్కుకోవడంతో వారిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. నది ఒడ్డుకు అత్యంత సమీపంలో పాఠశాల భవనాన్ని నిర్మించడం వల్ల అది బలహీనపడి కూలిపోయిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

Advertisement

Next Story