నాటో కొత్త సెక్రటరీ జనరల్‌గా నెదర్లాండ్స్‌ ఆపద్ధర్మ ప్రధాని

by Harish |
నాటో కొత్త సెక్రటరీ జనరల్‌గా నెదర్లాండ్స్‌ ఆపద్ధర్మ ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న వేళ నాటో(NATO) కూటమి సెక్రటరీ జనరల్‌గా నెదర్లాండ్స్‌ ఆపద్ధర్మ ప్రధాని మార్క్ రుట్టెను బుధవారం ఎన్నుకున్నారు. ఈ పదవి కోసం పోటీపడ్డ రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ యెహానిస్‌ ఇటీవల పోటీ నుంచి తప్పుకోవడంతో రుట్టె నియామకం లాంఛనప్రాయం కాగా, తాజాగా నాటో మిత్రపక్షాలు ఆయనను తదుపరి బాస్‌గా ఎన్నుకున్నాయి. 1 అక్టోబర్ 2024 నుండి రుట్టె సెక్రటరీ జనరల్‌గా తన విధులను స్వీకరిస్తారని నాటో ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఈ పదవిపై ఆసక్తి కనబరిచిన ఆయన, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో సహా కూటమిలోని ముఖ్య సభ్యుల నుండి ముందస్తు మద్దతు పొందారు.

నాటోలో తూర్పు ఐరోపా దేశాలు ఈ పదవిని మొదటిసారిగా తమ ప్రాంతం నుండి ఎవరికైనా ఇవ్వాలని వాదించాయి, అయినప్పటికి మార్క్ రుట్టె‌ను ఎన్నుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు, ఉక్రెయిన్‌కు గట్టి మిత్రుడిగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం ఈ కూటమికి బాస్‌గా ఉన్న జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తన వారసుడిగా రుట్టే ఎంపికను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మార్క్ నిజమైన అట్లాంటిసిస్ట్, బలమైన నాయకుడు, ఏకాభిప్రాయ-బిల్డర్, నేను నాటోను సమర్థ నాయకత్వం గల వారి చేతుల్లో వదిలివేస్తున్నానని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే నాటో బాస్‌గా రుట్టె పలు సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంది. ముఖ్యంగా రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ చేస్తున్న పోరాటానికి మిత్రదేశాల మద్దతు కూడగట్టడంలో ఆయనకు సవాళ్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed