మార్స్ రోవ‌ర్‌కు దొరికిన ఫ్రెండ్.. 4 నెల‌లుగా రెండూ క‌లిసే ఇలా..?!

by Sumithra |
మార్స్ రోవ‌ర్‌కు దొరికిన ఫ్రెండ్.. 4 నెల‌లుగా రెండూ క‌లిసే ఇలా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః అంగార‌క గ్రహంలో మాన‌వుడు అడుగుపెట్టే స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్ర‌మంలో గ‌త కొంత కాలంగా మార్స్‌పైన‌ నాసా పంపిన మార్స్‌ రోవర్ 'ప్రిజ‌ర్వెన్స్‌' చ‌క్క‌ర్లు కొడుతూ, ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు భూమిపైకి పంపిస్తోంది. అయితే, ఎంతో పట్టుదలతో తిరుగుతున్న ఈ రోవ‌ర్‌కు ఇప్పుడు అంగారక గ్రహంపై స్నేహితుడు దొరికిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. అయితే, అంత‌రిక్ష ప్రేమికుల మెద‌ళ్ల‌లో ఈ స్నేహితుడు ఒక‌ గ్రహాంతర వాసి కాదు కదా అనే సందేహం చ‌టుక్కున వ‌స్తుందేమో..! కానీ, కాదు. ఇదొక చిన్న పెంపుడు రాయి అనొచ్చు. అవును, మార్స్ రోవ‌ర్‌, ఈ రాయి దాదాపు నాలుగు నెలలుగా కలిసి ఉన్నారు. కలిసే మార్స్ గ్ర‌హంలో ప్ర‌యాణిస్తున్నారు. ప్ర‌స్తుతం రెండూ విడదీయరానివిగా మారిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఫిబ్రవరి ప్రారంభంలో మార్స్‌పైన ఈ రోవర్ తిరుగుతున్న‌ప్పుడు ఎడమ ముందు చక్రంలోకి ఒక రాయి దూరింది. మార్స్ రోవ‌ర్ అన్వేషణా, కార్యకలాపాలకు ప్ర‌స్తుతం ఈ శిల సాక్షిగా మారినట్లు క‌నిపిస్తోంది. ఎందుకంటే ఈ రాయి మార్స్ రోవ‌ర్‌తో పాటు ఇప్ప‌టికే 5.3 మైళ్లు (8.5 కిలోమీటర్లు) కంటే ఎక్కువే ప్రయాణించింది. ప్ర‌స్తుతం ఇవి రెండూ మార్స్‌లోని కఠినమైన భూభాగంలో ప్రయాణం చేస్తున్నాయి. మార్స్‌పై ఉన్న పురాతన సరస్సు, నది డెల్టా ఉన్న జెజెరో క్రేటర్‌ను అన్వేషించడానికి ఈ రాయి రోవర్‌తో పాటు వెళుతోంది. అయితే, హిచ్‌హైకింగ్‌లో ఉన్న ఈ రాయి, రోవర్ కార్యకలాపాలను దెబ్బతీయకుండా ఉండ‌టం విశేషం. ఇక‌, రోవర్ చక్రంలో ఈ రాయి ఎంత సేపు ఇలా దొర్లుతుందో చూడాలి అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

Advertisement

Next Story

Most Viewed