- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bangladesh: షేక్ హసీనాపై హత్య కేసు నమోదు..!
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసింది. అయితే ఆమెపై ఆ దేశంలో తాజాగా హత్య కేసు నమోదైందని సమాచారం. ఇటీవల నిరసనలు హింసాత్మకంగా మారడంతో వాటిని అణిచివేసేందుకు పోలీసులు జులై 19న జరిపిన కాల్పుల్లో ఒక కిరాణా దుకాణం యజమాని అబుసయ్యద్ కూడా మరణించాడు. దీంతో అతని మరణానికి షేక్ హసీనాను బాధ్యులుగా పేర్కొంటూ అతని కుటుంబ సభ్యుల తరపున ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు హసీనాతో పాటు, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీ అబ్దుల్లా అల్ మామున్, అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్ సహా మరికొందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
బంగ్లాదేశ్ దినపత్రిక ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం, అమీర్ హమ్జా షాటిల్ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేసినట్లు తెలుస్తుంది. అమీర్ తరపున న్యాయవాది మమున్ మియా మాట్లాడుతూ, షేక్ హసీనాతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. బంగ్లాదేశ్ చట్టం ప్రకారం నిందితులపై హత్య కేసు నమోదు చేయాలని ఢాకా మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించిందని ఆయన తెలిపారు. మరోవైపు అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 84 ఏళ్ల నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణస్వీకారం చేశారు. అక్కడి అల్లర్లలో ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా మరణించారు.