"క్షణక్షణం భయం భయం".. పశ్చిమాసియాను కమ్మేసిన యుద్ధ మేఘాలు

by Geesa Chandu |
క్షణక్షణం భయం భయం.. పశ్చిమాసియాను కమ్మేసిన యుద్ధ మేఘాలు
X

దిశ వెబ్ డెస్క్: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయిల్ పై యుద్ధం చేస్తామంటూ ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్ కు మద్దతుగా రష్యా అంగీకారం తెలిపినట్లు కొన్ని అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలకు కొనసాగింపు అన్నట్లుగా.. 2024, ఆగస్టు 6 వ తేదీ రష్యా నుంచి 12 జెట్ ఫైటర్ యుద్ధ విమానాలు ఇరాన్ చేరినట్లు తాజా సమాచారం. ఈ అకస్మాత్తు పరిణామాలతో మూడో ప్రపంచ యుద్ధానికి అంతా సిద్ధం కావాలంటూ.. సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది.

రష్యా నుంచి 12 యుద్ధ విమానాలు ఇరాన్ చేరాయన్న నేపథ్యంలోనే.. లెబనాన్ దేశంలోని లెబనీస్ పట్టణం పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులతో లెబనాన్ లో ఐదుగురు పౌరులు మరణించారు. దీంతో ఆ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరో వైపు ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అమెరికా కు చెందిన యుద్ధ నౌకలపై అత్యాధునిక యుద్ధ జెట్ ఫైటర్ లు ఉండటం ఇప్పుడు సంచలనం గా మారింది. ఈ విషయాన్ని యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్ స్వయంగా ప్రకటించటంతో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వరుస ఘటనలతో ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావొచ్చనే వార్తలతో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story