బంగ్లాదేశ్‌లో సైనిక పాలన.. ప్రజలకు ఆర్మీ రిక్వెస్ట్

by Gantepaka Srikanth |
బంగ్లాదేశ్‌లో సైనిక పాలన.. ప్రజలకు ఆర్మీ రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో పరిస్థితి మరింత అదుపుతప్పింది. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో ఆ దేశంలో పాలన ఆర్మీ చేతుల్లోకి వెళ్లింది. ఈ సందర్భంగా దేశ ప్రజలు, పౌరులకు ఆర్మీ అధికారులు కీలక రిక్వెస్ట్ చేశారు. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం పాలనను పర్యవేక్షిస్తోందని తెలిపారు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తామని అన్నారు. మరోవైపు ప్రధాని హసీనా నివాసంలోకి ఆందోళనకారులు చొరబడ్డారు. ఢాకాలో జాతిపిత షేక్ ముజిబుర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇక ఢాకాలోని పీఎం అధికారిక నివాసం గణభబన్‌ను ముట్టడించారు. కొందరు నిరసనకారులు పీఎం నివాసంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా, ఆమె సోదరి షేక్‌ రెహానా బంగ్లాను వీడి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల విషయంలో హింస చెలరేగిన విషయం తెలిసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300 లకు పైగా పౌరులు మృతిచెందారు.

Advertisement

Next Story

Most Viewed