Microsoft Crash : మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్.. సీఈవో సత్యనాదెళ్ల ఆసక్తికర ట్వీట్

by Sathputhe Rajesh |
Microsoft Crash : మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్.. సీఈవో సత్యనాదెళ్ల ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్‌పై ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఇది అతి పెద్ద సంక్షోభం అన్నారు. త్వరలోనే దీనికి పరిష్కారం చూపుతామన్నారు. నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్ డేట్ కారణంగా వరల్డ్ వైడ్‌గా టెక్నికల్ ఇష్యూ రైజ్ అయిందన్నారు. సమస్యను గుర్తించి దీనికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులకు సాంకేతిక సహాయం అందించి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నామన్నారు. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా మైక్రో సాఫ్ట్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఔటేజ్ సమస్యతో 77 శాతం విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. అమెరికా, డల్లాస్, చికాగోలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 18 గంటలు ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దీంతో ఎయిర్ పోర్టులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కంప్యూటర్లు మొరాయించడంతో సేవలు నిలిచిపోయాయి. ఇక ఈ సమస్యతో దేశవ్యాప్తంగా 200కి పైగా విమానాలు రద్దు అయ్యాయి.

Next Story

Most Viewed