- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా కథను తలపించే కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లాల సుదీర్ఘ ప్రేమగాథ
దిశ, వెబ్ డెస్క్ : క్వీన్ ఎలిజబెత్ II మరణం తరువాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. మరికొన్ని గంటల్లోనే ఆ వేడుక జరుగనుంది. బ్రిటన్ రాజప్రాసాదంలో రాజదర్పాల వెనుక ఎన్నో చరిత్రలు..మరెన్నో వివాదాలు. ఈ రాజకుటుంబ వారసుల వివాహాలు, ప్రేమ గాథల్లో ఎన్నెన్నో ట్విస్టులు ఉన్నాయి. ముఖ్యంగా కింగ్ చార్లెస్ III (King Charles III), ఆయన భార్య కెమిల్లా మరికొన్ని రోజుల్లో బ్రిటన్ రాజుగా,రాణిగా కిరీట ధారణ చేయబోతున్నారు. ఈ సందర్భంగా వారి ప్రేమ గాథ దాంట్లో దాగున్న ట్విస్టుల గురించి తెలుసుకుందాం.. కింగ్ చార్లెస్ III, కెమిల్లా పార్కర్ 35 ఏళ్ల ప్రేమ కథలో ఆసక్తికర ఘటలు ఎన్నో..
బ్రిటన్ రాణిగా కిరీటధారణ చేయబోతున్న కెమిల్లా.. రాజకుటుంబంలో అడుగు పెట్టడం వెనుక ఆసక్తికర అంశాలున్నాయి. కిరీటంపై హక్కు కోసం చార్లెస్, కెమిల్లాలు పెళ్లి కూడా చేసుకోకుండా వెయింట్ చేసిన వెనుక చరిత్ర ఉంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. చార్లెస్ కు కెమిల్లాకు ఇద్దరికి రెండో వివాహాలే. రెండో వివాహం చేసుకుంటే కిరీటంపై హక్కు ఉండదు బ్రిటన్ వంశంలో ఉండే నిబంధల ప్రకారం. అందుకే చార్లెస్, కెమిల్లాలు ఆ నిబంధనలను సవరించిన తరువాత వివాహం చేసుకున్నారు. బ్రిటన్ కుటుంబ కోడలిగా కెమిల్లా రాజప్రాసాదంలో రాజసంగా అడుగుపెట్టారు. మరి ఈ ట్విస్టుల వెనుక ఉన్న ఆసక్తికర ప్రేమకథ..
1947 జులై 17న జన్మించిన కెమిల్లా బ్రిటిష్ సైనికాధికారి కుమార్తె. వయసులో కింగ్ ఛార్లెస్ కంటే 16నెలలు పెద్ద. కెమిల్లాకు ఇప్పుడు 75 ఏళ్లు. చార్లెస్ కు 74. 1970లో పోలోక్లబ్‌లో ఓ ఫంక్షన్ లో వీరిద్దరు తొలిసారి కలుసుకున్నారు. అలా ఇద్దరు ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. ఆ తరువాత చార్లెస్ వెంటనే నౌకాదళంలో పనిచేసేందుకు వెళ్లారు. దీంతో వీరిద్దరి ప్రేమకు గ్యాప్ వచ్చింది. చార్లెస్ తిరిగి వచ్చేసరికి కెమిల్లా ఆండ్రూపార్కర్ బోవెల్స్ అనే వ్యక్తిని వివాహంచేసుకుంది.
ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ ఆండ్రూ పార్కర్ గతంలో ప్రిన్స్ ఛార్లెస్ సోదరి ప్రిన్సెస్ ఆన్‌తో ప్రేమాయణం సాగించాడు. పెళ్లయినా ఛార్లెస్, కెమిల్లా (Camilla) స్నేహం కొనసాగింది. 1980లో డయానా సోదరి సారాతో డేటింగ్ చేసిన చార్లెస్… చివరకు డయానాను పెళ్లాడారు. వీరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తరువాత వీరిద్దరి మధ్యా విభేధాలు వచ్చాయి. ఫలితంగా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి విడాకులకు కారణం చార్లెస్ తో కెమిల్లా తన సంబంధాన్ని కొనసాగించటమేనంటారు. ఎందుకంటే కెమిల్లా, చార్లెస్ మధ్య సంబంధం కొనసాగినట్లుగా వారిద్దిరి మధ్య జరిగిన అత్యంత సన్నిహిత సంభాషణలు అప్పట్లో లీక్ అయ్యాయి. పెను సంచలనంగా మారాయి. అది అక్రమ సంబంధం అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కెమిల్లాతో తనకు సంబంధం ఉన్నట్లుగా అప్పట్లో చార్లెస్ కూడా అంగీకరించారు. కానీ చార్లెస్ భార్య డయానాకు కూడా ఎంతో మంది పురుషులతో ముఖ్యంగా సంబంధాలున్నాయని తేలింది. ఆ తరువాత డయానా ఒక కార్ యాక్సిడెంట్‌లో చనిపోవటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
కెమిల్లా భర్త ఆండ్రూతో విడాకులు తీసుకున్నారు. దీంతో చార్లెస్, కెమిల్లా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ బ్రిటన్ వంశంలో ఉన్న నిబంధనల ప్రకారం రెండోపెళ్లి చేసుకునేవారికి రాజకిరీటంపై హక్కు ఉండదు. దీంతో 2002లో ఈ నిబంధనను సవరించేదాకా ఆగి… 2005లో చార్లెస్-కెమిల్లాలు పెళ్లి చేసుకున్నారు. 1970లో మొదలైన ప్రేమాయణం… చివరకు 2005లో 35 ఏళ్ల తర్వాత పెళ్లిగా మారింది. అలా రాజభవనంలో కెమిల్లా రాజసంగా అడుగుపెట్టి… బ్రిటన్ రాణి (British Princess)గా కొలువుదీరనున్నారు.
కాగా చార్లెస్ డయానాకు ఇద్దరు కుమారులు. వీరిద్దరికి జూన్ 21,1982లో పెద్దకుమారుడు ప్రిన్స్ విలియం జన్మించారు. తరువాత సెప్టెంబర్ 15,1984లో రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ జన్మించాడు. ప్రస్తుతం ప్రిన్స్ హ్యారీ రాజకుటుంబంతో విడిపోయి దూరంగా ఉంటున్నారు.
ప్రిన్స్ హ్యారీ (Prince Harry) వివాహం కూడా వివాదంగా మారింది. ప్రిన్స్ హ్యారీ, హాలీవూడ్ నటి మేఘన్ మార్ల్కెన్‌ల వివాహం రాజకుటుంబంలో సంచలనమే సృష్టించింది. ముఖ్యంగా పెద్దకుమారుడు విలియమ్స్ వీరి వివాహాన్ని ఇష్టపడలేదు. హ్యారీ కంటే మేఘన్ మూడేళ్లు పెద్ద. ఇలా రాజకుటుంబంలో వివాహాలు.. ప్రేమకథల్లో ఎన్నో ట్విస్టులు..వివాదాలు ఉన్నాయి.