Trump-Harris:ప్రచారంలో దూసుకుపోతున్న కమలా హారీస్..ట్రంప్‌ కంటే రెట్టింపు విరాళాల సేకరణ..!

by Maddikunta Saikiran |
Trump-Harris:ప్రచారంలో దూసుకుపోతున్న కమలా హారీస్..ట్రంప్‌ కంటే రెట్టింపు విరాళాల సేకరణ..!
X

దిశ, వెబ్‌డెస్క్:అమెరికా(America)లో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ ఎన్నికలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో అధ్యక్ష అభ్యర్థులిద్దరు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్(Democratic) పార్టీ నుంచి కమలా హారిస్‌(Kamala Harris),రిపబ్లికన్‌(Republican) పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) బరిలోకి దిగుతున్నారు.ఈ ఇద్దరి అభ్యర్థుల మధ్య ఫైటింగ్ పోటాపోటీగా ఉంది. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే హారిస్‌ ఆగస్టులో దాతల నుంచి భారీగా విరాళాలను సేకరించింది.ఆగస్టు నెలలో ట్రంప్‌కు వచ్చిన విరాళాల కంటే హారిస్‌కు రెట్టింపు విరాళాలు రావడం గమనార్హం. దాదాపు 36.1 కోట్ల డాలర్ల విరాళాలను కమలా సేకరించింది.కాగా సెప్టెంబర్‌లో న్యూయార్క్‌, అట్లాంటా, లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో లాంటి కీలకమైన ప్రాంతాల్లో పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్‌ బృందం ఏర్పాట్లు చేస్తోంది.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం విరాళాల సేకరణలో కాస్త వెనుకంజలో ఉన్నారు.ట్రంప్‌ ఆగస్టులో 13 కోట్ల డాలర్లను మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది. ఈ క్రమంలో ట్రంప్‌ కంటే కమలాకు దాదాపు మూడు రెట్లు విరాళాలు ఎక్కువ వచ్చాయి.త్వరలో జరగబోయే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఇందుకోసంఏకంగా 1 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికయ్యే ఖర్చులు, ప్రకటనల కోసం ఇరు పార్టీ అభ్యర్థులు భారీగా నిధులను సేకరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed