Bandi Sanjay : 6 గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు

by Aamani |   ( Updated:2024-09-16 10:29:12.0  )
Bandi Sanjay : 6 గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు
X

దిశ,కరీంనగర్ రూరల్ : తెలంగాణ ప్రజా పాలన దేనికోసం.. ఎవరికి భయపడి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరుతో అధికారికంగా ఎందుకు ఉత్సవాలు నిర్వహించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నరని విమర్శించారు. నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నరన్నారు. అందుకే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదన్నారు. కాంగ్రెస్ కు చేతనైతే తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా నేనే హాజరవుతనని అన్నారు. వారికి చేతకాకుంటే కేంద్రం పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్ననన్నారు.విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రశాంత వాతావరణంలో ఎలాంటి గొడవ లేకుండా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీతో చర్చించి ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్ననన్నారు. హిందువుల పండుగలపై వివక్ష చూపుతున్నారనే భావన హిందువుల్లో నెలకొందన్నారు. ఆ భావనను తొలగించేలా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. భగవన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో భాగంగానే కరీంనగర్ లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకుని వారు నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రేపు నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను విస్త్రతంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవం తెలంగాణ ప్రజలకు పండుగ రోజని, నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సమర యోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన రోజన్నారు. నాడు రజాకార్లు మహిళలను నగ్నంగా బట్టలిప్పించి బతుకమ్మ ఆడించిన దురాగతాలను మర్చిపోలేమన్నారు. బైరాన్ పల్లి, పరకాల, గుండ్రాంపల్లి ఘటనలను మర్చిపోలేమన్నారు. సర్దార్ పటేల్ ‘ఆపరేషన్ పోలో పేరుతో చేసిన సాహసం వల్ల నేడు నిజాం పాలన నుండి తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు.ఇంతటి మహత్తర ఘటనపై ఉత్సవాలు నిర్వహించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తోందన్నారు. రజాకార్ల దళం స్రుష్టించిన పార్టీయే ఎంఐఎం. ఆ పార్టీకి భయపడి, ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నయన్నారు. నాటి యోధుల త్యాగాలను మర్చిపోయారన్నారు.

ఓట్ల కోసం రజాకార్ల పార్టీని సంకనేసుకుని తిరుగుతుండం సిగ్గు చేటన్నారు. రజాకార్ పార్టీ వారసుడు ఒవైసీ ప్రభుత్వ భూములను కబ్జా చేసి పేదలను దోచుకుంటున్న రన్నారు. అలాంటి ఒవైసీని సిగ్గు లేకుండా పేదల పక్షపాతి అని పొగడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కూల్చకుండా ఒవైసీకి వంతపాడుతున్నరని విమర్శించారు.సర్దార్ పటేల్ మాకు వీరుడే... పటేల్ వారసులం మేమేనని, తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ముమ్మాటికీ బీజేపీకి వీరుడే. ఆ పటేల్ వారసులమని చెప్పుకునేందుకు మేం గర్వపడుతున్నామన్నారు.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోక వస్తే హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు కాంగ్రెస్ రాజకీయ డ్రామాలకు నిదర్శనం అన్నారు.6 గ్యారంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలను, దమ్ముంటే 6 గ్యారంటీల్లో ఎన్ని అమలయ్యాయి? ఎంత మంది లబ్ధి పొందారు.? ఎన్ని నిధులు ఖర్చు చేశారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. చేతనైతే 6 గ్యారంటీలపై ప్రజల్లో చర్చ పెట్టాలే తప్ప విగ్రహాల లొల్లి సిగ్గు చేటన్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంపై...ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఖాళీగానే ఉందని, ఆయన కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆ పదవి ఇస్తారేమోనని అన్నారు. ఎందుకంటే ఇద్దరిదీ లిక్కర్ కేసేనని, వారి విధానాలు బంధాలు, వ్యాపారాలు ఒక్కటేనన్నారు.

అందుకే కేసీఆర్ కుటుంబంలో ఒకరికి సీఎం పదవి ఇస్తారేమో వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దేనికోసం..? ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం అని ఎందుకు అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం లేదని,పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నరన్నారు. అందుకే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదన్నారు. కాంగ్రెస్ కు చేతనైతే తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా నేనే హాజరవుతనన్నారు. వారికి చేతకాకుంటే కేంద్రం పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవానికి’ హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.6 గ్యారంటీలపై మేం నిలదీస్తుంటే...కాంగ్రెస్, బీఆర్ఎస్ విగ్రహాల పేరుతో లొల్లి చేస్తూ మీడియాకు ఎక్కుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. వాళ్లెన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో ఉన్నది బీజేపీనే నని ప్రజల కోసం పోరాడే పార్టీ బీజేపీయే అన్నారు.

Advertisement

Next Story