- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి.. కమలా హారిస్ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నిక(US presidential election)ల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఘన విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ(Democratic Party) మహిళా అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris)పై ఆయన గెలుపొందారు. దీంతో 79 ఏళ్ల వయసులో ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. తాజాగా.. ఫలితాలపై కమలా హారిస్ స్పందించారు. హోవర్డ్ యూనివర్సిటీ(Howard University) వేదికగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఫలితాలను అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
కానీ, తన పోరాటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపబోను అని ప్రకటించారు. స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుంది. దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదే అని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ పడిన తీరుపై గర్వంగా ఉందని అన్నారు. ప్రజల స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం ఇక నుంచి తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలన కోసం పోరుబాటను ఎప్పటికీ వీడను అని ఆమె కీలక ప్రకటన చేశారు. కొన్నిసార్లు సానుకూల ఫలితాలకు సమయం పడుతుందని అన్నారు. అనంతరం కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు కమలా హారిస్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.