Kamala Harris : ఇక నుంచి నన్ను కమల అని పిలవండి.. పార్టీ శ్రేణులకు కమలా హారీస్‌ సూచన

by Maddikunta Saikiran |
Kamala Harris : ఇక నుంచి నన్ను కమల అని పిలవండి.. పార్టీ శ్రేణులకు కమలా హారీస్‌ సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరో మూడు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ క్రమంలో అధ్యక్ష అభ్యర్థులిద్దరు తమ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎవరికీ వారు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు.ఈ సందర్భంగా ప్రచారంలో ఓటర్లు ఆకట్టుకునేందుకు డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారీస్‌ కొత్త ప్లాన్‌ ఎంచుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పేరులోని 'కమల' అనే పదాలను మాత్రమే వాడుతున్నారు. ఇక నుంచి నన్ను ఎవరు కమలా హారీస్ అని పిలవొద్దని కేవలం 'కమల' అనే పిలవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.మాజీ అధ్యక్షడు,డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన బరాక్‌ ఒబామా, అలాగే పలువురు నేతల సూచనల మేరకు కమలా హారీస్‌ తన పేరును 'కమల'గా మార్చుకుని ప్రచారంలో దూకుడును పెంచారు.ఈ క్రమంలో డెమోక్రటిక్‌పార్టీ మద్దతుదారులు కూడా ఆమెను కమల.. కమల అని నినాదాలు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు ఇటీవల ఆమెకు కమలా అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. హారీస్ నుండి కమల కి మారడం ద్వారా తన ప్రచారంలో ఓటర్లకు దగ్గర కావడానికి కమలా హారీస్ ప్లాన్‌ చేసుకుంటున్నారు. మరోవైపు..రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఆమెను పలుమారు కమల అని పిలవడంతో ఆ పేరు ప్రజల్లోకి సులభంగా వెళ్తుందనే కారణంగానే ఇలా ఫిక్స్‌ చేసినట్టు సమాచారం.

Advertisement

Next Story