- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిన్‌పింగ్ సరికొత్త చరిత్ర.. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నిక
దిశ, డైనమిక్ బ్యూరో : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(69) చరిత్ర సృష్టించారు. వరుసగా మూడోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్ష పోటీలో మరొకరు లేకపోవడంతో జిన్‌పింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ‘రాయిటర్స్’వెల్లడించింది. ఝావో లెజీ పార్లమెంట్ నూతన చైర్మన్‌గా, హాన్ ఝెంగ్ నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలోనూ వీరిద్దరూ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలోని జిన్‌పింగ్ బృందంలో ఉన్నారు.
గతేడాది అక్టోబర్‌లో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభల్లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యారు. అలాగే, చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గానూ జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. ఫలితంగా మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. వరుసగా ఎన్నికవుతున్న ఆయన పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు. కాగా, దేశానికి ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా పనిచేయాలన్న నిబంధనను 2018లో జిన్‌పింగ్ ఎత్తివేశారు. ఫలితంగా ఆయన రిటైర్ అయ్యే వరకు లేదంటే మరణించే వరకు, లేదంటే బహిష్కృతయ్యే వరకు ఆయనే చైనా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.