- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జపాన్ తొలి ప్రయివేట్ రాకెట్ ప్రయోగం విఫలం: గాలిలోనే పేలిపోయిన శాటిలైట్
దిశ, నేషనల్ బ్యూరో: వాణిజ్య పరంగా అంతరిక్షంలో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్న జపాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని టోక్యోకు చెందిన స్టార్టప్ ‘స్పేస్ వన్’ కో అభివృద్ధి చేసిన రాకెట్‌ను బుధవారం ఉదయం కుషిమోటో ప్రాంతంలోని లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగించారు. అయితే కక్ష్యలోకి ప్రవేశపెట్టిన కాసేపటికే రాకెట్ గాలిలో పేలిపోయింది. భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. ఈ పరీక్ష విజయవంతం అయితే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన మొదటి జపాన్ ప్రయివేట్ సంస్థగా స్పేస్ వన్ అవతరించేంది. దీంతో ఉపగ్రహ-ప్రయోగ మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న జపాన్ కు షాక్ తగిలింది. అయితే ప్రమాదంలో జరిగిన నష్టం గురించి అధికారులు వెల్లడించలేదు.
స్పేస్ వన్ తయారు చేసిన ఈ రాకెట్ 59 అడుగులు ఉంటుంది. నాలుగు దశల ఘన ఇంధనంతో పని చేస్తుంది. దీనికి కైరోస్ అని నామకరణం చేశారు. కైరోస్ అనగా పురాతన గ్రీకు భాషలో సరైన క్షణం అని అర్ధం. కైరోస్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని మార్చి 9నే ప్రయోగించాలని మొదట భావించారు. కానీ ప్రయోగ ప్రదేశంలో ఓ నౌకను గుర్తించడం వల్ల వాయిదా వేశారు. ఈ రాకెట్ వైఫల్యం స్పేస్ వన్‌కు మాత్రమే కాకుండా దాని అనుబంధ సంస్థలకు షాక్ ఇచ్చింది. రాకెట్ పేలుడు తర్వాత జపాన్ షేర్లు ఏకంగా 13శాతం పడిపోయాయి.
‘స్పేస్ వన్’ నేపథ్యం
స్పేస్ వన్ సంస్థను 2018లో పలువురు పెట్టబడిదారుల మద్దతుతో ప్రారంభించారు. ఇది కెనాన్ ఎలక్ట్రానిక్స్, ఐహెచ్ఐ ఏరోస్పేస్, షిమిజు కార్పొరేషన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ జపాన్ సహా ప్రధాన జపనీస్ టెక్ వ్యాపార బృందం కలిసి స్థాపించారు. వాణిజ్య అంతరిక్ష మిషన్లను అభివృద్ధి చేసి, మార్కెట్లో సముచిత స్థానాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. షిమిజు కార్పొరేషన్ కైరోస్ కోసం సొంత ప్రయోగ ప్రదేశాన్ని నిర్మించింది. దీనికి స్పేస్ పోర్ట్ కియ్ అని పేరు పెట్టారు.