- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జపాన్ కనుమరుగు కావొచ్చు..
టోక్యో: పురాణాల్లో వరమిచ్చిన శివుడి ప్రాణాలకే సంకట స్థితిని తీసుకొచ్చిన భస్మసురుడి కథ గుర్తుంది కదా.. అచ్చు అదే తరహాలో జపాన్‌లో పరిస్థితి నెలకొన్నట్లు కనిపిస్తోంది. జనాభా నియంత్రణకు తీసుకొచ్చిన ఆంక్షలు ఆ దేశ మనుగడను ప్రశ్నార్థకం తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొచ్చాయి. గతేడాది జననాల రేటు భారీగా తగ్గిపోవడాన్ని ఉద్దేశించి జపాన్ ప్రధానమంత్రి సహాయకులు మసక మోరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా రేటు ఇలాగే కొనసాగితే జపాన్ కనుమరుగు అవుతుందని అన్నారు.
గతేడాది జననాల రేటు అత్యల్పంగా నమోదైనట్లు ఫిబ్రవరిలో జపాన్ అధికారులు ప్రకటించారు. 2008లో 12.8 కోట్ల జనాభా ఉండగా, ప్రభుత్వ చర్యలతో 12.46 కోట్లకు పడిపోయింది. దేశంలో జనాభా క్షీణత రేటు క్రమంగా పెరుగుతుందని పలు నివేదికలు తెలిపాయి. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 29 శాతం పైగా ఉంది. అయితే అన్ని దేశాల్లోకెల్లా దక్షిణ కొరియాలో జననాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ, జపాన్ జనాభా మాత్రం వేగంగా తగ్గుతుందని నివేదికలు తెలిపాయి.
పిల్లలను కనే వయస్సులో ఉన్న మహిళల సంఖ్య తగ్గడం జనాభా రేటు తగ్గడానికి కారణంగా ఉందని చెప్పారు. అయితే పిల్లలను పోషించేందుకు, పెంచేందుకు తల్లులకు ప్రోత్సహాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చని మోరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది జపాన్ లో 8 లక్షల జననాలు సంభవించగా, 15.8 లక్షలు మరణాలు చోటుచేసుకున్నాయి.