రెడ్‌క్రాస్ సేవకు సిద్ధమైన 22 ఏళ్ల రాజకుమారి

by Hajipasha |
రెడ్‌క్రాస్ సేవకు సిద్ధమైన 22 ఏళ్ల రాజకుమారి
X

దిశ, నేషనల్ బ్యూరో : సింప్లిసిటీకి మారుపేరు జపాన్ రాజ కుటుంబం. జపాన్ రాజు నరుహిటో, రాణి మసాకోల ఏకైక సంతానం రాజకుమారి ఐకో. 22 ఏళ్ల ఐకో త్వరలో దేశం కోసం ఒక కీలకమైన డ్యూటీ చేయబోతున్నారు. ఆమె ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జపనీస్ రెడ్‌క్రాస్ సొసైటీలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం టోక్యోలోని గకుషుయిన్ విశ్వవిద్యాలయంలో ‘జపనీస్ భాష, సాహిత్యం’ కోర్సులో ఐకో గ్రాడ్యుయేషన్ కోర్సు ఫైనలియర్ చదువుతోంది. ఈ కోర్సు త్వరలోనే ముగుస్తుంది. ఆ వెంటనే ఆమె జపనీస్ రెడ్‌క్రాస్ సొసైటీలో పనిచేయడం ప్రారంభిస్తారు. రెడ్‌క్రాస్‌‌లో పనిచేయాలనే ఆసక్తి తనకు ఉందని ప్రిన్సెస్ ఐకో చెప్పారు. జపాన్ రాజవంశం సంప్రదాయం ప్రకారం.. దేశ సింహాసనాన్ని చేపట్టే హక్కు కేవలం పురుషులు మాత్రమే ఉంటుంది. రాజవంశానికి చెందిన మహిళలకు వారి ఆసక్తిని బట్టి రాజవంశం నిర్వహించే వివిధ సంస్థల బాధ్యతలను అప్పగిస్తారు.

Advertisement

Next Story

Most Viewed