- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel : యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి.. హౌతీల స్థావరాలపై బాంబుల వర్షం
దిశ, నేషనల్ బ్యూరో : యెమన్‌లోని హౌతీ రెబల్స్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం రోజు హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ఒక పౌరుడు మరణించాడు. దీనికి ప్రతిగా శనివారం రోజు యెమెన్ నౌకాశ్రయం హొదైదాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. 1,800 కిలోమీటర్ల దూరంలోని యెమన్‌పై ఇజ్రాయెల్ నేరుగా సైనిక దాడి చేయడం ఇదే మొదటిసారి.
ఈ దాడి అనంతరం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గెలెంట్ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇజ్రాయెల్ పౌరుల రక్తానికి ఒక ధర ఉంది. ఇరాన్ మద్దతుగల హౌతీలు మాపై దాడి చేసేందుకు సాహసిస్తే వారిపై మేం మరిన్ని తీవ్ర దాడులు చేస్తాం’’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. గతంలో హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్‌లోని అష్డోద్, హైఫా, ఈలాట్ సహా పలు నగరాలపై దాడులకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. అయితే దేశ రాజధాని టెల్ అవీవ్‌పై హౌతీలు దాడి చేయడం అనేది తొలిసారిగా శుక్రవారం జరిగింది. అందుకే ఆ ఘటనను ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించి ప్రతీకార దాడి చేసింది.