Israel vs Hezbollah : ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా ఆత్మాహుతి దాడులు

by Maddikunta Saikiran |
Israel vs Hezbollah : ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా ఆత్మాహుతి దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్ : శుక్రవారం ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో హమాస్ అధికారి సమీర్ అల్-హజ్ మృతి చెందారు. ఈ హత్యకు ప్రతీకారంగా హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై నిన్న ఆత్మాహుతి డ్రోన్‌లతో దాడి చేసింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సఫేద్ నగరానికి సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరంపై వరుస ఆత్మాహుతి డ్రోన్‌లతో హిజ్బుల్లా దాడి చేసింది. అధికారులు, సైనికుల స్థావరలే లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో స్థావరంలో ఉన్న పలువురు ఆర్మీ అధికారులకు, సైనికులకు గాయాలయ్యాయి.

కాగా.. శుక్రవారం దక్షిణ లెబనాన్ ప్రాంతమైన సిడాన్ నగరంలో ఇజ్రాయెల్ చేసిన డ్రోన్ దాడిలో హమాస్ అధికారి సమీర్ అల్-హజ్ మరణించినట్లు "జిన్హువా" (Xinhua) అనే వార్తా సంస్థ వెల్లడించింది . అలాగే దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతంలో ఆరు గ్రామాలపై, పలు పట్టణాలపై ఇజ్రాయెల్‌ ఆర్మీ సైనికులు 10 వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారని 18 గృహాలను ధ్వంసం అయ్యాయని లెబనాన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ దాడులు చేసినట్టు హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా ప్రకటించారు.

Next Story

Most Viewed