Israel vs Hamas: బందీలను హత్య చేసే వారెవరు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కోరుకోరు.. హమాస్ పై విమర్శలు గుప్పించిన బెంజమిన్ నెతన్యాహు

by Maddikunta Saikiran |
Israel vs Hamas: బందీలను హత్య చేసే వారెవరు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కోరుకోరు.. హమాస్ పై విమర్శలు గుప్పించిన బెంజమిన్ నెతన్యాహు
X

దిశ, వెబ్‌డెస్క్:హమాస్ చెరలో ఉన్న ఆరుగురు బందీలను ఓ సొరంగంలో హమాస్ ఉగ్రవాదులు అతి కిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. కాగా గత సంవత్సరం అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై చేసిన దాడిలో హమాస్ వీరిని బందీలుగా పట్టుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) వెల్లడించింది.అప్పటి నుంచి వీరిని చిత్ర హింసలకు గురి చేసి ఉంటారని IDF అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దక్షిణ గాజా ప్రాంతంలోని రఫా నగరంలో IDF దళాలు చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా వీరి మృతదేహాలను గుర్తించారు.వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.ఇదిలా ఉండగా బందీల మరణ వార్తతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బందీల ప్రాణాల గురించి అతను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు.ఆరుగురు బందీలు మృతి చెందడం బాధాకరమని ,బందీల మరణవార్త విని గుండె పగిలిందని నెతన్యాహు తెలిపారు.హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కోరుకోవడంలేదాడనానికి ఈ హత్యలే ఉదాహరణని, హమాస్ ఆరుగురు బందీలను చంపిందని ఆయన చెప్పారు. కాల్పుల విరమణ ప్రయత్నాలను కూడా హమాస్ అడ్డుకుంటున్నదని, బందీలను హత్య చేసేవారెవరు కాల్పుల విరమణ ఒప్పందం కోరుకోరని హమాస్ పై విమర్శలు గుప్పించారు. మృతి చెందిన బందీలలో ఇజ్రాయెల్ అమెరికన్ పౌరుడు కూడా ఉండటంతో US అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అతడి మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేరాలకు హమాస్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని బైడెన్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed