Israel: ఢిల్లీలో ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద భారీ భద్రత

by Maddikunta Saikiran |
Israel: ఢిల్లీలో ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద భారీ భద్రత
X

దిశ, వెబ్‌డెస్క్:ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.అయితే.. గత నెల 31న, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ నాయకుడి ఇస్మాయిల్ హనీయే హత్య జరిగింది.ఈ హత్యకు ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. కాగా.. ఈ హత్య నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద భద్రతను పెంచాలని ఢిల్లీ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై ఆ దేశ ఎంబసీ వద్ద భారీ భద్రతను పెంచారు.

ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ఇజ్రాయిల్ భవనాల చుట్టూ భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చెయ్యడానికి సీనియర్ అధికారులు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే ఆ రెండు భవనాల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు,రెండంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అలాగే అవసరమైతే మరింత ఎక్కువ సిబ్బందిని నియమించుకుంటామని వెల్లడించారు.గత ఏడాది నుండి ఇజ్రాయిల్ ,హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా ఆ దేశ రాయబార కార్యాలయం చుట్టూ ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు.కాగా.. గత మూడేళ్లలో, దేశ రాజధానిలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో తక్కువ తీవ్రతతో రెండు బాంబ్ పేలుళ్లు జరిగాయి.ఈ రెండు దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదు.

Next Story

Most Viewed