Chess Olympiad 2024:చెస్ ఒలింపియాడ్‌.. చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో భారత జట్లు..!

by Maddikunta Saikiran |
Chess Olympiad 2024:చెస్ ఒలింపియాడ్‌.. చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో భారత జట్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: చెస్ ఒలింపియాడ్‌(Chess Olympiad)లో చరిత్ర సృష్టించేందుకు(History Create) భారత పురుషుల చెస్ జట్టు ఒక్క అడుగు దూరంలో ఉంది.హంగేరీ(Hungary) రాజధాని బుడాపెస్ట్‌(Budapest) వేదికగా SYMA స్పోర్ట్స్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో శనివారం అర్థరాత్రి తర్వాత జరిగిన ఓపెన్ విభాగంలో పదో రౌండ్‌లో భారత్(India)2.5-1.5 తేడాతో టాప్-సీడ్ అమెరికా(United States)పై విజయం సాధించింది.దీంతో ఓపెన్ విభాగంలో దేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకానికి చేరువైంది.

శనివారం జరిగిన 10వ రౌండ్‌లో భారత పురుషుల జట్టు మొదటి గేమ్ ఓటమితో ప్రారంభించింది.స్టార్ ప్లేయర్ ప్రజ్ఞానందా 41 ఎత్తుల్లో వెస్లీ(Wesley) చేతిలో ఓటమిపాలయ్యాడు. తర్వాత జరిగిన రెండో గేమ్ లో FIDE క్యాండిడేట్స్ టోర్నమెంట్ విజేత డి గుకేష్ D Gukesh, ఫాబియానో కరువానా(Fabiano Caruana)పై 1-0 తేడాతో విజయం సాధించాడు.దీంతో 1-1 తో స్కోర్ సమమయ్యింది. మూడో గేమ్ లో విదిత్ గుజరాతి(Vidit Gujrathi) 0.5-0.5తో లెవాన్ అరోనియన్‌(Levon Aronian)తో డ్రా చేసుకున్నాడు.చివరి గేమ్ లో తెలుగు కుర్రాడు ,గ్రాండ్ మాస్టర్ అర్జున్(Arjun)1-0తో లీనియర్ పెరెజ్‌(Leinier Perez) పై గెలుపొందడంతో మ్యాచ్ భారత్ సొంతమయ్యింది.10 రౌండ్లు ముగిసేసరికి భారత పురుషుల జట్టు 19 మ్యాచ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.ఆదివారం స్లోవేనియా(Slovenia)తో జరగనున్న చివరి రౌండ్‌లో భారత్ విజయం సాధిస్తే తొలిసారి స్వర్ణ పతకం గెలుచుకునే అవకాశం ఉంది.

మరోవైపు భారత మహిళల జట్టు కూడా పదో రౌండ్‌లో2.5-1.5తో చైనా(China)పై విజయం సాధించి పసిడి రేసులో ముందు స్థానంలో ఉంది.హరీక ద్రోణవల్లి(Harika Dronavalli),వంతిక అగర్వాల్(Vantika Agrawal) ,వైశాలి(Vaishali) తమ గేమ్ లను డ్రా చేసుకోగా,దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) భారత్ తరుపున ఏకైక విజయం సాధించింది.మహిళల జట్టు 10 రౌండ్లు ముగిసేసరికి 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ఇప్పటివరకు నాలుగు పతకాలు గెల్చుకుంది. 2020లో రష్యాతో కలిసి భారత్ సంయుక్తంగా స్వర్ణ పతకం గెల్చుకోగా 2014,2021,2022లో కాంస్యా పతకాలు గెలిచింది. ఈసారి భారత్ ఓపెన్,మహిళల విభాగంలో స్వర్ణం గెలవడం దాదాపుగా ఖాయం కాబట్టి.. చెస్ ఒలింపియాడ్‌ చరిత్రలో భారత జట్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన అవుతుంది.

Next Story

Most Viewed