Israel Lebanon: వీలైనంత త్వరగా లెబనాన్‌ను వీడండి..తమ పౌరులకు యూకే విజ్ఞప్తి

by vinod kumar |
Israel Lebanon: వీలైనంత త్వరగా లెబనాన్‌ను వీడండి..తమ పౌరులకు యూకే విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇతర దేశాలు లెబనాల్‌లో ఉన్న తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. ఇటీవల ఇండియా తమ సిటిజెన్స్‌కు సూచనలు జారీ చేయగా..తాజాగా యూకే సైతం తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. లెబనాన్‌లోని యూకే పౌరులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమవుతాయని హెచ్చరించింది. ‘లెబనాన్‌లో తరచుగా వైమానిక దాడులు జరిగే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతాయి’ అని యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

‘ఎటువంటి పరిస్థితులపైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. విదేశీ కార్యాలయ కాన్సులర్ బృందాలతో కలిసి పని చేస్తున్నాం. కానీ వివాదం తీవ్రమైతే.. ప్రతి ఒక్కరినీ వెంటనే ఖాళీ చేయగలుగుతామని ప్రభుత్వం హామీ ఇవ్వదు’ అని చెప్పారు. లెబనాన్‌లో ఉంటే వాణిజ్య విమానాలు నడుస్తున్నప్పుడు ఆ దేశం నుంచి వచ్చేయాలని సూచించారు. ప్రస్తుతం యూకేలో ఉన్నవారు లెబనాన్‌కు వెళ్లొద్దని తెలిపారు. కాగా, ఇరాన్ మద్దతు గల హిజ్బొల్లా సంస్థ ఇజ్రాయెల్‌లోని ఫుట్ బాల్ మైదానంపై దాడులు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హిజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed