Israel: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. ఐదుగురు మృతి

by vinod kumar |
Israel: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. ఐదుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతూనే ఉంది. శనివారం గాజా నగరంలో పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న షుహద ఆల్ జైతున్ పాఠశాలపై వైమాణిక దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు ఓ మహిళతో సహా ఐదుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు రెండు క్షిపణులతో పాఠశాలను ఢీకొట్టినట్టు గాజా లోని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రతినిధి మహమూద్ బస్సల్ తెలిపారు. మృత దేహాలను శిథిలాల కింద నుంచి బయటకు తీసినట్టు వెల్లడించారు. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

అయితే ఈ దాడి కన్నాముందు ఇజ్రాయెల్ ఓ ఇంటిపై క్షిపణి దాడి చేయగా 11 మంది మరణించినట్టు పలు కథనాలు వెల్లడించాయి. అయితే దీనిని గాజా అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇజ్రాయెల్ సైన్యం ఇటీవలి కాలంలో శరణార్థి శిబిరాలుగా మారిన అనేక పాఠశాలలపై దాడులు చేసింది. జనాభాలో ఉగ్రవాదులను దాచడానికి హమాస్ వాటిని ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపిస్తోంది. అయితే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ఈ వాదనను తిరస్కరించింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకారం, సెంట్రల్ గాజాలోని నుసెయిరత్‌లోని అల్-జవ్నీ పాఠశాలపై బుధవారం జరిగిన దాడిలో 18 మంది మరణించారు.

Advertisement

Next Story