Israel - Iran : మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

by Maddikunta Saikiran |
Israel - Iran : మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?
X

దిశ, వెబ్‌డెస్క్: హమాస్,హెజ్‌బొల్లా గ్రూప్ అగ్రనేతలు ఇస్మాయిల్ హనియా, ఫౌద్ షుకుర్‌ల హత్యలనంతరం పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. తమ భూభాగంలో హమాస్ అగ్రనేతను హత్య చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఇరాన్,ఇజ్రాయిల్ పై ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ క్రమంలో.. ఇజ్రాయిల్ పై దాడులకు ఇరాన్ సిద్ధమైంది.మరోవైపు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా మిలిటరీ కమాండర్ ,ఫౌద్ షుకుర్‌ మృతి చెందారు.దీనికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా ఆదివారం తెల్లవారుజామున డజన్లకొద్దీ రాకెట్లతో ఇజ్రాయిల్ పై విరుచుకుపడింది. కాగా ఈ రాకెట్లను ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది.కాగా ఈ రెండు గ్రూపులకు ఇరాన్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. ఏ క్షణమైనా ఇజ్రాయిల్ పై ఇరాన్, హెజ్బొల్లా కలిసి సంయుక్తంగా దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని తెలిపారు. ఇజ్రాయిల్,ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు ఆంటోని, G7 దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు'x'లో తెలిపారు.అలాగే ఎలాంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ తో కలిసి సిద్దమవుతున్నామని తెలిపారు. దీంతో ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే పరిస్థితి నెలకుంది.

Advertisement

Next Story