గాజాలో ఆకలికేకలు.. అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయెల్..!

by Satheesh |   ( Updated:2023-10-13 13:48:48.0  )
గాజాలో ఆకలికేకలు.. అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయెల్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హమాస్ ఉగ్రవాదుల దాడులతో ప్రతిదాడులకు దిగిన ఇజ్రాయెల్ పాలస్తీనాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. హమాస్ మిలిటెంట్ల ఏరివేతలో భాగంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ఉక్కుపాదం మోపుతూ భీకర దాడులకు దిగింది. దీంతో ఈ ప్రాంతంలో కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద మృతదేహాలు. ఎగిసిపడుతున్న దుమ్ము ధూళీ, పొగలు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. గాజాను ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనం చేసింది. నీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను అందకుండా అడ్డుకోవడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తు్న్నారు. మరోవైపు దారులన్ని మూకుపోవడంతో ఇక్కడి ఆసుపత్రుల్లో అత్యవసర ఔషధాలకు కొరత ఏర్పడింది. తమ చిన్నారుల ఆకలిని తీర్చేందుకు ఎవరైనా సహయం చేస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story