చర్చలు జరుగుతున్నప్పటికీ రఫాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్

by Disha Web Desk 17 |
చర్చలు జరుగుతున్నప్పటికీ రఫాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హామాస్ యుద్ధాన్ని ముగించాలని చేస్తున్న ప్రయత్నాలు కొంతమేరకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నప్పటికి కూడా శుక్రవారం ఇజ్రయెల్, గాజా స్ట్రిప్‌లో దాడులు ప్రారంభించింది. తెల్లవారుజామున ఈజిప్ట్‌తో భూభాగ సరిహద్దులో ఉన్న రఫాపై ఫిరంగి దాడులను చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇరుపక్షాల మధ్య సంధి కుదర్చడానికి రెండు రోజుల రౌండ్ సమావేశాలను నిర్వహించారు. ఇంకా యుద్ధ ముగింపుపై స్పష్టత రాలేదు.

మధ్యవర్తులు ముందుకు తెచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరించినట్లు హమాస్ సోమవారం తెలిపింది. ఈ ఒప్పందంలో గాజా నుండి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ, యుద్ధం కారణంగా వెళ్లిపోయిన పాలస్తీనియన్లు తిరిగి రావడం, శాశ్వత కాల్పుల విరమణ చేపట్టడం, బందీలను విడవటం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం శాశ్వత కాల్పుల విరమణపై ముందుకు రావడం లేదు. హమాస్‌ను పూర్తిగా కూల్చివేయాలని పట్టుబడుతుంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఈజిప్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏడు నెలల నుంచి సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాల్సి ఉంది. సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరు పక్షాలు కూడా సామరస్యంగా కాల్పుల విరమణ చేపట్టాలని ఈజిప్ట్ కోరింది. రఫాపై దాడులు ప్రారంభమైన నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు వీలైనంత వేగంగా సంధి చర్చలు ముగించి అక్కడి ప్రజలను కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed