- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లిక్కర్ కుంభకోణం.. కేజ్రీవాల్ కస్టడీ కోరుతూ కోర్టుని ఆశ్రయించిన ఈడీ
దిశ, నేషనల్ బ్యూరో: కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ ప్రత్యేక కోర్టుని ఆశ్రయించింది ఈడీ. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ జూన్ 1తో ముగుస్తుంది. ఆయన కోర్టులో లొంగిపోయినప్పుడు 14 రోజులపాటు కస్టడీ కోరుతూ ఢిల్లీ ప్రత్యేక కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసింది. మరోవైపు, కేజ్రీవాల్ కు బెయిల్ రాకముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి కస్టడీ కోరుతూ.. కోర్టుకి దరఖాస్తు చేసుకుంది ఈడీ.
కేజ్రీవాల్‌తో పాటు సహ నిందితురాలు,బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితపై విచారణ జరిపేందుకు తగిన సాక్ష్యాలున్నాయి అని కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ ఇద్దరు నాయకులపై దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ ల గురించి ఈడీ వివరించింది. ఛార్జ్ షీట్లను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈడీ వాదనలను మంగళవారం విననుంది కోర్టు. మరోవైపు, కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 2 వరకు పొడిగించింది కోర్టు
ఇకపోతే, 2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపొందించడంలో అవినీతి, మనీలాండరింగ్ కు జరిగిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేశారు. ఆగస్టు 17, 2022న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ను పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 22, 2022లో ఈడీ కేసు నమోదు చేసింది.