- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Breaking: తిరుమల మాదిరిగా ఒంటిమిట్టలోనూ ప్రతి రోజు అన్నదానం

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) మాదిరిగా ఒంటిమిట్ట(Ontimitta)లోనూ ప్రతి రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrabu Naidu) టీటీడీ బోర్డు(TTT Board)ను కోరారు. ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవం(Ramulori Kalyanam) వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. స్వామి అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణోత్సవం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తిరుమలలో మొట్టమొదటి సారిగా నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Ramarao) అన్నదాన కార్యక్రమం చేపట్టారని గుర్తు చేశారు. ఈ రోజు 2200 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని, ప్రతి రోజూ లక్ష మందికి తిరుమలలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు.
తిరుమల మాదిరిగా ఇక నుంచి ఒంటిమిట్టలోనూ భక్తులకు అన్న ప్రసాదం అందించాలని టీటీడీని కోరారు. ఇందుకు బోర్డులో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బదులిచ్చారు. ఒంటిమిట్ట కూడా పవిత్రమైన గుడి అని చెప్పారు. ఒంటిమిట్టకు వచ్చిన భక్తులు ఆకలితో వెళ్లకూడదని తెలిపారు. తిరుమలలో ఎంత పవిత్రంగా ఉచిత అన్న ప్రసాదం పెడుతున్నారో.. ఒంటిమిట్టలో కూడా పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఒంటి మిట్టలో అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చస్తామని చెప్పారు. సీతారాముల కల్యాణం చూసి పరవశించిపోయామని చంద్రబాబు తెలిపారు.
‘‘ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా తయారు చేస్తాం. పక్కనే ఉన్న చెరువును బ్యూటీఫికేషన్ చేస్తాం. భక్తులు రెండు, మూడు రోజులు ఇక్కడే ఉండేలా టూరిజాన్ని ఏర్పాటు చేస్తాం. దేవాలయాలు లేకపోతే కుటుంబ వ్యవస్థ ఉండేదికాదు. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి గొప్ప వారసత్వ సంపద కుటుంబ వ్యవస్థ. కుటుంబం కోసం ఆలోచిస్తాం. ఒకరికొకరికి భద్రత ఇస్తాం. కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. అలాంటి వ్యవస్థను కాపాడుకుని మన తర్వాత వారసులకు అప్పగించాల్సిన బాధ్యత మనకుంది. రామరాజ్యం తీసుకురావడమే నా ఆకాంక్ష. శ్రీరాముడు నాకు స్ఫూర్తి. రాముడి పాలన ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి మేలు చేయాలని శ్రీరాముడి సాక్షిగా చెబుతున్నా ’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.