- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యాపై ఉగ్రదాడి..బాధ్యత వహించిన ఐఎస్!
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా రాజధాని మాస్కోలో ఉన్న క్రోకస్ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్ హాల్‌పై శుక్రవారం సాయంత్రం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. హాలులోకి ప్రవేశించిన దుంగడులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పాటు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 60కి చేరినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేగాక సుమారు 115 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉందని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఐదుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
అటాక్‌కు మాదే బాధ్యత: ఐఎస్
ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూప్ బాధ్యత వహించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘రష్యా రాజధాని మాస్కో శివార్లలోని క్రాస్నోగోర్స్క్ నగరంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు గుమిగూడి ఉన్న వారిపై ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు దాడి చేశారు. వారు సురక్షితంగా తమ స్థావరాలకు తిరిగి వచ్చేలోపు వందలాది మందిని చంపి, గాయపరిచారు’ అని పేర్కొంది. గత కొన్ని రోజులుగా రష్యాలో ఐఎస్ యాక్టివ్‌గా ఉంది. ఈ నెల 7వ తేదీన కూడా.. ఇస్లామిక్ స్టేట్ సెల్ మాస్కోలోని ప్రార్థనా మందిరంపై దాడిని అడ్డుకున్నట్లు రష్యా అత్యున్నత భద్రతా ఏజెన్సీ తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంపై పట్టు పెంచుకున్న కొద్ది రోజులకే ఈ దారుణమైన దాడి జరగడం గమనార్హం.
రష్యా ప్రజలకు అండగా ఉంటాం: మోడీ
మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘రష్యాలో జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాం. ఈ దుఖ:సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటాం’ అని తెలిపారు. మరోవైపు యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ వంటి అనేక దేశాలు ఈ ఘటనకు ఖండించాయి. అమెరికా సైతం ఈదాడిని భయంకరమైననదిగా పేర్కొంది. అయితే ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రమేయం ఉందని రష్యా ఆరోపించగా..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. ఉక్రెయిన్‌కు ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.