పాలస్తీనాపై సౌదీ, ఇరాన్‌ చర్చలు..

by Vinod kumar |
పాలస్తీనాపై సౌదీ, ఇరాన్‌ చర్చలు..
X

రియాద్‌ : ఇజ్రాయెల్ విధించిన గాజా సీజ్ కారణంగా గాజాలోని 23 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత పరిస్థితులపై ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ, సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్ సల్మాన్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. పాలస్తీనాలో యుద్ధ నేరాలకు ముగింపు పలకాల్సిన అవసరంపై వారి మధ్య డిస్కషన్ జరిగిందని సమాచారం. ‘‘అమాయక ప్రజల ప్రాణాలు పోవడాన్ని సౌదీ వ్యతిరేకిస్తుంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పాలస్తీనా ప్రజలకు చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించేందుకు, ఆ ప్రాంతంలో శాంతి స్థాపన చర్యలకు సౌదీ మద్దతిస్తుంది’’ అని ఇరాన్‌ అధినేతకు సౌదీ యువరాజు చెప్పినట్లు తెలిసింది. ఈమేరకు సౌదీ, ఇరాన్ మీడియాల్లో కథనాలు వచ్చాయి.

చైనా మధ్యవర్తిత్వంతో ఇరాన్‌, సౌదీ అరేబియా దేశాల మధ్య ఈ ఏడాది మార్చిలో దౌత్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి తెరపడింది. పరస్పరం దౌత్య కార్యాలయాలను తెరిచేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో పాలస్తీనా అంశంపై ఇరుదేశాల కీలక నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed