ఆఫ్ఘనిస్తాన్‌లో కుప్పకూలిన భారత విమానం

by GSrikanth |
ఆఫ్ఘనిస్తాన్‌లో కుప్పకూలిన భారత విమానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. తోప్‌ఖానా ప్రాంతంలోని పర్వతాల్లో భారత విమానం ఒక్కసారగా కుప్పకూలింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకొని అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన విమానంలో భారీగా ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంలో ఎవరైనా మృతిచెందారా? గాయాలతో బయటపడ్డారా? అనేది తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story