ఐరాసా భద్రతా మండలిలో బ్రిటన్ ప్లేసులో భారత్‌కు ఛాన్స్ ఇవ్వాలి.. సింగపూర్ మాజీ దౌత్యవేత్త కీలక వాఖ్యలు

by Maddikunta Saikiran |
ఐరాసా భద్రతా మండలిలో బ్రిటన్ ప్లేసులో భారత్‌కు ఛాన్స్ ఇవ్వాలి.. సింగపూర్ మాజీ దౌత్యవేత్త కీలక వాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) విషయంలో సింగపూర్‌కు చెందిన మాజీ దౌత్యవేత్త కిశోర్‌ మహబూబానీ (Kishore Mahbubani) కీలక వ్యాఖ్యలు చేశారు.యూఎన్‌ఎస్‌సీలో తక్షణ సంస్కరణలు అవసరమని, ఐక్యరాజ్యసమితి అత్యున్నత సంస్థలో శాశ్వత సభ్యదేశంగా భారత దేశానికి సముచిత స్థానం కల్పించాలని ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. యునైటెడ్ కింగ్‌డమ్ భారతదేశం కోసం UN భద్రతా మండలి (UNSC)లో తన శాశ్వత స్థానాన్ని వదులుకోవాలని కిశోర్‌ పేర్కొన్నారు.

అమెరికా , చైనా తర్వాత భారతదేశం నేడు ప్రపంచంలో మూడో అత్యంత శక్తిమంతమైన దేశమని,అందులో ఎటువంటి సందేహం లేదని, 'గ్రేట్‌' బ్రిటన్ ఇకపై గొప్ప దేశమేమి కాదని ఆయన అన్నారు.UK తన స్థానాన్ని ఎందుకు వదులుకోవాలో వివరిస్తూ.. UK తనపై వ్యతిరేక ముద్ర పడకుండా తప్పించుకునేందుకుగానూ దశాబ్దాలుగా తన వీటో అధికారాన్ని ఉపయోగించలేదని, కాబట్టి UK చేయవలసిన పని భారతదేశానికి తన సీటును వదులుకోవడమేనని కిశోర్‌ చెప్పారు.పైగా అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించేందుకు బ్రిటన్‌కు ఇది తోడ్పడుతుంది'' అని వివరించారు. కాగా కిశోర్‌ మహబూబానీ 1984-89, 1998-2004 మధ్యకాలంలో ఐరాసకు సింగపూర్ దేశం తరుపున శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. యూఎన్‌ఎస్‌సీకి రెండుసార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed