నేను అధ్యక్షుడిగా ఉంటే మరోలా ఉండేది: ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణపై ట్రంప్ వ్యాఖ్యలు

by samatah |
నేను అధ్యక్షుడిగా ఉంటే మరోలా ఉండేది: ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణపై ట్రంప్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని తప్పుపట్టిన ట్రంప్.. తాను అధ్యక్షుడి ఉంటే ఇరాన్ దాడి చేసి ఉండేది కాదని తెలిపారు. ఇలా జరగనివ్వకుండా అడ్డకునేవాడినని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. బైడెన్ చేసిన వ్యాఖ్యలను రికార్డు చేశారని, కానీ ఇది ప్రసంగాలకు సమయం కాదని తెలిపారు. అంతకుముందు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయొద్దని అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. కానీ ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నట్టు యూఎస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఎదురు దాడికి అమెరికా మద్దతివ్వదు: బైడెన్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడిని అమెరికా ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఎదురుదాడి చేస్తే అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతివ్వబోదని బైడెన్ నెత్యన్యాహుకు సూచించినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రమాదకర చర్యలు చేపట్టొద్దని ఇజ్రాయెల్‌కు తెలిపారు. కానీ ఇజ్రాయెల్‌కు యూఎస్ అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. కాగా, ఇజ్రాయెల్‌కు రక్షణగా ఇప్పటికే యూఎస్ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను తరలించింది.

Advertisement

Next Story

Most Viewed