ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ హాలీవుడ్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

by Hamsa |
ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ హాలీవుడ్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన మొదటి హాలీవుడ్ మూవీ ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’(The Extraordinary Journey of the Fakir). ఈ సినిమాను ఏకంగా రూ. 175 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే 2019లో విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టి మూవీ మేకర్స్‌కు నష్టాలు తెచ్చిపెట్టింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా కేవలం 92 నిమిషాలు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ డిజాస్టర్ చిత్రం ఇంగ్లీష్‌ భాషలో యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా, ఇప్పుడు విడుదలైన ఆరేళ్లకు తెలుగు వెర్షన్ రాబోతున్నట్లు సమాచారం. మార్చి 26న తమ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రముఖ సంస్థ ఆహా ప్రకటించింది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉండే ఒక రోజు ముందు అంటే మార్చి 25 నుంచి చూడొచ్చని వెల్లడించింది. కాగా, ధనుష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కుబేర, ఇడ్లీ కడై (Idli Kadai)వంటి చిత్రాలతో రాబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్స్ త్వరలోనే థియేటర్స్‌లోకి రానున్నాయి. అయితే దనుష్ ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే దర్శకత్వం కూడా వహిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు.

Next Story

Most Viewed