మౌనేశ్వర ఆలయంలో చోరీ.. అంత ఖాళీ చేసి ఆ తర్వాత..

by Aamani |
మౌనేశ్వర ఆలయంలో చోరీ.. అంత ఖాళీ చేసి ఆ తర్వాత..
X

దిశ,మక్తల్: పట్టణ శివారులో ఉన్న మౌనేశ్వర ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గర్భగుడి తలుపులు పగలగొట్టి హుండీలో నగదు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హుండీలో రూ.30వేల వరకు నగదుంటుందని, పంచలోహ విగ్రహం విలువ రూ.50 వేలు కలిపి లక్ష వరకు ఉంటుందని కమిటీ సభ్యులు అంటున్నారు.

మక్తల్ పట్టణ శివారులో అయ్యప్ప స్వామి గుడి వెనుక భాగం ముస్లిం ఈద్గా ముందు భాగంలో ఉన్న మౌనేశ్వర్ ఆలయంలో చుట్టుపక్కల నివాస గృహాలు ఉన్న రాత్రి సమయంలో జన సంచారం లేకపోవడంతో లో దుండగులు చోరీ చేయడానికి సులువైందని, దేవాలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లి అందులో ఉన్న నగదును తీసుకెళ్లి ఖాళీ హుండీని వ్యవసాయ పొలంలో పడేసి వెళ్లిపోయారు. ఉదయం పూజారి పూజలు చేయడానికి వచ్చి జరిగిన సంఘటన ను చూసి పూజారి ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో శనివారం ఉదయం మక్తల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed