- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Hvaldimir Whale: రష్యా స్పైగా ప్రసిద్ధి చెందిన "హ్వాల్దిమిర్" తిమింగలం మృతి
దిశ, వెబ్డెస్క్: 2019లో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘హ్వాల్దిమిర్’ అని పిలువబడే తెల్ల తిమింగలం నార్వేలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.సుమారు 14 అడుగుల పొడవు, 2,700 పౌండ్ల బరువు కలిగిన ఇది ఆగస్టు 31న స్టావంజర్ దగ్గరలోని బే ఆఫ్ రిసవికాలో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.2019లో ఉత్తర నార్వేలోని హామర్ఫెస్ట్ సమీపంలో మొదటిసారిగా ఈ తిమింగలం కనిపించింది. దానికి నార్వే నుంచి ‘హ్వాల్’, రష్యా నుంచి ‘వాల్దిమిర్’ పేర్లు కలిపి ‘హ్వాల్దిమిర్’ అని పెట్టారు.కాగా ఇది రష్యా నిఘా తిమింగలంగా వార్తల్లోకెక్కింది. దీని మెడకు సెయింట్ పీటర్స్ బర్గ్ అనే లేబుల్ ఉండడంతో ఇది రష్యా నిఘావర్గంలో భాగమనే ఊహాగానాలు వెలువడ్డాయి.అప్పటి నుంచి రష్యా స్పైగా వార్తల్లోకెక్కింది. అయితే వీటిపై స్పందించిన రష్యా అది తమ వేల్ కాదని స్పష్టం చేసింది.
మెరైన్ మైండ్ వ్యవస్థాపకుడు, హ్వాల్దిమిర్ సంరక్షణ బాధ్యతలు చూసుకునే సెబాస్టియన్ స్ట్రాండ్ దీని మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు.హ్వాల్దిమిర్ మృతి చెందిదన్న వార్త నార్వేలోని వేలాది మంది ప్రజల హృదయాలను తాకిందన్నారు.హ్వాల్దిమిర్ మృతికి ముందు ఎంతో ఆరోగ్యంగా ఉందని,ఈ తిమింగలం మరణానికిగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇది రష్యా నిఘా తిమింగలంగా పేరు పొందడంతో ఈ తిమింగలంతో ఎవరు కూడా కాంటాక్ట్ పెట్టుకోవద్దని గత సంవత్సరం నార్వే దేశం తన పౌరులను సూచించింది.