ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. పాకిస్తాన్‌లో 9 మంది మృతి

by Mahesh |
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. పాకిస్తాన్‌లో 9 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్ సమీపంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో పాకిస్తాన్ వాయువ్వ ఖైదర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలో భారీ ప్రకంపనలు వచ్చాయి. దీంతో పాకిస్తాన్ కు చెందిన 9 మంది చనిపోయారు. అలాగే మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ భూకంపం కారణంగా.. గత రాత్రి ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. కాగా ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్ సమీపంలో 187.6 కి.మీ లోతులో ఉంది.

Advertisement

Next Story