Pakistan: పాక్ అణుకేంద్రంలో భారీ పేలుళ్లు..?

by Vinod kumar |
Pakistan: పాక్ అణుకేంద్రంలో భారీ పేలుళ్లు..?
X

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ డేరా ఘాజీ ఖాన్ ప్రాంతంలో ఉన్న అణు కమిషన్ కార్యాలయం పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో కలకలం రేగింది. దేశంలోనే అతిపెద్ద అణు కేంద్రానికి నెలవైన ఈ క్యాంపస్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరం దాకా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. రెస్క్యూ టీమ్‌లు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీనిపై స్పందించిన డేరా ఘాజీ ఖాన్ ఏరియా కమిషనర్ నాసిర్ మహమూద్ బషీర్.. ఓ యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినందు వల్లే ఆ భారీ శబ్దాలు వచ్చాయని స్పష్టం చేశారు. అణు విస్ఫోటనం జరిగిందని, షాహీన్ క్షిపణి పరీక్ష ఫెయిల్ అయిందని జరిగిన ప్రచారమంతా అబద్ధమని కొట్టిపారేశారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి జరిగి 48 గంటలైనా గడవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Advertisement

Next Story