- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో నౌకపై హౌతీల ఎటాక్.. అమెరికా ఆర్మీ ఎంట్రీతో ఏమైందంటే ?
దిశ, నేషనల్ బ్యూరో : ఏ నౌక కనిపిస్తే ఆ నౌకపై ఎడాపెడా దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లకు అమెరికా నౌకాదళం తగిన శాస్తి చేసింది.ఎర్ర సముద్రం మీదుగా సింగపూర్ జెండాతో వెళ్తున్న డెన్మార్క్ దేశ నౌక ‘మయెర్స్క్ హాంగ్‌జౌ’ను హైజాక్ చేసేందుకు హౌతీలు ఆదివారం తెల్లవారుజామున విఫల యత్నం చేశారు. నాలుగు బోట్లతో దాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. దీంతో మయెర్స్క్ హాంగ్‌జౌ నౌక.. అత్యవసర సహాయాన్ని కోరుతూ సమీపంలోని నౌకలన్నింటికీ మెసేజ్ పంపింది. దీనికి ఎర్ర సముద్రంలోనే పహారా కాస్తున్న అమెరికా యుద్ధనౌకలు యూఎస్ఎస్ ఐసెన్ హోవెర్, గ్రావెలీ అలర్ట్ అయ్యాయి. అవి వెంటనే రెండు హెలికాప్టర్లలో సైనికులను సంఘటనా స్థలానికి పంపాయి. హౌతీ మిలిటెంట్లు ఆ హెలికాప్టర్లపైకి కూడా కాల్పులు జరిపారు. ఈక్రమంలో అమెరికా సైనికులు జరిపిన ప్రతి కాల్పుల్లో మూడు బోట్లలోని హౌతీ మిలిటెంట్లు చనిపోయారు. ఆ బోట్లు సముద్రంలో మునిగిపోయాయి. నాలుగో బోటు మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయింది.