Hamas: సజీవంగానే హమాస్ అధినేత యహ్యా సిన్వార్..!

by Shamantha N |
Hamas: సజీవంగానే హమాస్ అధినేత యహ్యా సిన్వార్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్‌ అధినేత యహ్యా సిన్వార్‌( Yahya Sinwar) సజీవంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 7నాటి దాడుల్లో కీలక పాత్ర పోషించిన సిన్వార్ ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతి చెందినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆయన బతికే ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఖతర్‌తో రహస్య సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పలు మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. హమాస్‌ అధినేత యహ్యా సిన్వార్‌ సజీవంగా ఉన్నారని ఓ సీనియర్‌ ఖతర్‌ దౌత్యవేత్త తన సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సెప్టెంబర్ 21 దాడిలో చనిపోయినట్లు అనుమానం

అయితే, యహ్యా సిన్వార్..తన చుట్టూ ఇజ్రాయెల్‌ బందీలను తనకు రక్షణ కవచంగా ఉంచుకున్నట్లు ఖతర్‌ అధికారులు గతంలో పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 21న హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తీవ్రంగా దాడులు చేశాయి. ఆ దాడుల్లో సిన్వార్‌ మృతిచెంది ఉంటారని ఇజ్రాయెల్ భావించింది. దాన్ని నిజం చేసేలా.. అప్పట్నుంచి సిన్వార్ దగ్గర్నుంచి ఎలాంటి ప్రకటన కూడా వెలుడవలేదు. దీంతో, ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇజ్రాయెల్ దాడిలో 22 మంది చనిపోయినట్లు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. అందులోనే సిన్వార్ కూడా చనిపోయాడని ప్రపంచం అంతా భావించింది. అయితే, అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడులకు కీలకంగా మారిన సిన్వార్‌.. ఈ ఏడాది ఆగస్టులో హమాస్‌ అధినేతగా నియామకం అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed