- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురికి తీవ్ర గాయాలు..!
దిశ, వెబ్డెస్క్: అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరుగురుకి గాయాలు అయినట్లు సమాచారం. నాష్విల్లే మెట్రో పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం..దక్షిణ నాష్విల్లేలోని ఆంటియోచ్లో సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ కాల్పులు ఘటన చోటు చేసుకుంది. సోమవారం అర్థరాత్రి రెండు షూటింగ్ ఘటనలు జరిగినట్లు తెలిపారు.మొదటిది ఆంటియోచ్లోని స్కైబార్ & లాంజ్ పార్కింగ్ స్థలంలో జరగగా, రెండవ ఘటన దక్షిణ నాష్విల్లేలోని బ్రూక్వ్యూ ఎస్టేట్స్ సమీపంలో చోటు చేసుకుందని నాష్విల్లే పోలీసులు తెలిపారు. ఈ రెండు కాల్పుల ఘటనలు పది నిమిషాల వ్యవధిలోనే జరిగాయి. కాగా గాయపడ్డ వారిని అంబులెన్స్ లో సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని,బాధితులందరూ ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా కాల్పులు జరిపిన నిందితులను పట్టుకోవడానికి CCTV ఫుటేజీని పరిశీలుస్తున్నామని, వారిని త్వరలోనే పట్టుకొని విచారిస్తామని నాష్విల్లే మెట్రో పోలీసులు తెలిపారు.