ఇకపై ఆ పాట‌ల‌కీ అంత‌ర్జాతీయ గ్రామీ అవార్డ్స్‌లో చోటు.. పంట పండిన‌ట్లే!

by Sumithra |
ఇకపై ఆ పాట‌ల‌కీ అంత‌ర్జాతీయ గ్రామీ అవార్డ్స్‌లో చోటు.. పంట పండిన‌ట్లే!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ్యూజిక్ ప్ర‌పంచంలో గ్రామీ అవార్డ్స్‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు. అంత‌ర్జాతీయంగా గొప్ప గాయ‌కుల‌కు మాత్ర‌మే ఈ అవార్డు ద‌క్కుతుందంటారు. సంగీతం, గానం వంటి వివిధ విభాగాల్లో అవార్డుల‌ను అందించే గ్రామీ వచ్చే ఏడాది వేడుక నుండి ఐదు కొత్త విభాగాలను జోడిస్తున్న‌ట్లు నిర్వాహకులు తాజాగా తెలియ‌జేశారు. ఇందులో గేయ రచనతో పాటు సామాజిక మార్పు కోసం రూపొందించిన‌ ఉత్తమ పాటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇక‌, ఈ కొత్త కేటగిరీలో ఉత్తమ ప్రత్యామ్నాయ సంగీత ప్రదర్శన, ఉత్తమ అమెరికానా ప్రదర్శన, వీడియో గేమ్‌ల కోసం ఉత్తమ స్కోర్ సౌండ్‌ట్రాక్, ఇతర ఇంటరాక్టివ్ మీడియా, ఉత్తమ స్పోకెన్ వర్డ్ పోయెట్రీ ఆల్బమ్‌లు ఉండ‌టం విశేషం.

ఇందులో భాగంగా, సామాజిక మార్పు కోసం ఉత్తమ పాట కోసం ప్రత్యేక మెరిట్ అవార్డును ప్రవేశపెడున్న‌ట్లు చెప్పారు. దీని కోసం ఎంట్రీలు "సమయోచిత సామాజిక సమస్యను పరిష్కరించే విధంగా, అలాగే, అవగాహన క‌ల్పించి, శాంతిని పెంపొందించడం, సానుభూతిని ప్రోత్సహించే లిరికల్ కంటెంట్‌ను కలిగి ఉండాలి" అని నిర్వాహ‌కులు తెలిపారు. విజేతను కమిటీ ఎంపిక చేస్తుంద‌ని, రికార్డింగ్ అకాడమీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలచే ఆమోదించబడుతుందని రికార్డింగ్ అకాడమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హార్వే మాసన్ జూనియర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed