Good News for Indian Passport Holders: భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లకు.. పొరుగు దేశం శ్రీలంక శుభవార్త!

by Geesa Chandu |
Good News for Indian Passport Holders: భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లకు.. పొరుగు దేశం శ్రీలంక శుభవార్త!
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్(Indian Passport Holders) లకు మన పొరుగు దేశం శ్రీలంక(Sri Lanka) శుభవార్త తెలియజేసింది. భారత్ తో పాటు అనేక దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ని ప్రకటించింది. దీంతో భారతీయ ప్రయాణికులు శ్రీలంకకు త్వరలోనే వీసా రహిత యాక్సిస్ సౌకర్యాన్ని పొందనున్నారు. వార్తా సంస్థ పీటీఐ(PTI) నివేదిక ప్రకారం భారత్ తో పాటు 35 దేశాలకు ఈ సౌకర్యాన్ని కల్పించింది. వీటిలో భారత్, యూఎస్, బ్రిటన్ వంటి దేశాలు ఉండగా.. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. శ్రీలంక ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలతో.. మొత్తం 35 దేశాలు 6 నెలలపాటు వీసా రహిత యాక్సెస్‌ సౌకర్యాన్ని పొందనున్నాయి.దీనికి శ్రీలంక ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

కాగా, ప్రతి ఏటా.. పలుదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు శ్రీలంకను విజిట్(Visit) చేయడానికి వెళ్తుంటారు. నిజానికి ఈ పర్యాటక రంగం పైనే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడి ఉంది.

Next Story